⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:48 AM
*🔊ఇంటర్వ్యూల వాయిదా సమాచారం తెలియక పోటెత్తిన అభ్యర్థులు*
*🍥ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ సహాయ వార్డెన్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని భావించిన అభ్యర్థులు శుక్రవారం భారీఎత్తున తరలివచ్చారు. 20 పోస్టులకు ఈ నెల 20న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ పాలకమండలి ఈ నెల ఆరంభంలో వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు ఈ నెల 17న వెబ్‌సైట్‌లో పేర్కొంది. చాలామంది అభ్యర్థులు మొదట్లో ప్రకటించిన తేదీనే ఇంటర్వ్యూలు ఉంటాయని భావించి శుక్రవారం విశ్వవిద్యాలయానికి తరలివచ్చారు. వాయిదా వేసినట్లు తెలుసుకొని.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భైఠాయించారు. వాయిదా వేసినట్లు ఈ నెల 17నే తెలియజేశామని, త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. అభ్యర్థులు మధ్యాహ్నం వరకు వేచి చూసి వెళ్లిపోయారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m