
జై శ్రీరామ్ జై హనుమాన్
June 14, 2025 at 06:36 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము).
శ్రీమద్భాగవతమహాత్మ్యము (సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము). మొదటి అధ్యాయము
నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ్యమును ఈ విధంగా వర్ణిస్తున్నాడు.
శౌనకుడు సూత పౌరాణికుని ఇలా అడిగాడు. “భక్తితోనూ, జ్ఞానము తోనూ, వైరాగ్యముతోనూ మానవునిలో వివేకము ఏ విధంగా
వృద్ధి చెందుతుంది వివరించండి. లోకంలో సత్వ, రజస్తమోగుణము లతో కూడిన విష్ణుమాయ ఆవరించి ఉంది కదా! విష్ణుభక్తులు ఏ ప్రకారంగా ఈ మాయను దానివలన కలిగే మోహమును అధిగమిస్తారు. పైగా ఈ కలికాలంలో మానవులు ఎక్కువగా అసుర స్వభావము, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. నానా రకములైన బాధలతో దు:ఖములతో కుంగి పోతుంటారు. వాటిని దాటే ఉపాయమే లేదా! ఈ జీవుల మనసులను పరిశుద్ధము చేసే ఉపాయము ఏదైనా ఉందా! ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని పాదములను పొందడానికి అన్నిటి కంటే సుఖమైన, పవిత్రమైన, శాశ్వతమైన ఉపాయము ఒకటి నాకు తెలియజేయండి. మీరు మాకు గురువులు. చింతామణి అనే మణి కోరుకున్నసుఖాలు ఇస్తుంది. కల్పవృక్షము స్వర్గసుఖాలను ఇస్తుంది. కాని మీ వంటి గురువు మాకుమోక్షమును మార్గము సుగమం
చేస్తాడు.” అని అడిగాడు.
అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు. సూతుడు శౌనకునితో ఇలా అన్నాడు. "బ్రాహ్మణోత్తమా! నీ హృదయములో భగవంతుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ కారణంగానే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవులకు జననము, మరణము ఇవే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. ఆ భయాన్ని పోగొట్టే మార్గమును నీకు వివరిస్తాను. మానవునిలో భక్తి భావమును వృద్ధి చేసి, పరమాత్మను చేరుకొనే ఉపాయము నీకు చెబుతాను సావధానంగా విను.
పూర్వము వ్యాసుడు భాగవత పురాణమును రచించాడు. దానిని తన కుమారుడు అయిన శుక మహర్షికి చెప్పాడు. శుక మహర్షి వలన భాగవత పురాణము లోకములో వ్యాప్తి చెందింది. మనస్సు శుద్ధి కావాలంటే ఈ భాగవతపురాణము కంటే మంచి సాధనము మరొకటి లేదు. కేవలం పూర్వజన్మ పుణ్యము ఉంటేనే భాగవత పురాణము వినే భాగ్యము కలుగుతుంది.
వ్యాసుని కుమారుడైన శుకుడు ఈ భాగవత పురాణమును పరీక్షిత్ మహారాజుకు వినిపించడానికి సిద్ధంగా ఉండగా, దేవతలు అమృత కలశముతో అక్కడకు వచ్చారు. వారు శుక మహర్షితో ఇలా అన్నారు.
“మహాత్మా! ఈ అమృత కలశమును తీసుకొని మాకు ఆ భాగవత కథామృతమును మాకు ఇవ్వండి. ఈ అమృతమును పరీక్షిత్ మహారాజుకు ఇవ్వండి. ఆయన మృత్యువును జయిస్తాడు. తక్షకుడు
కాటు వేసినా ఆయన చావడు.” అని అన్నారు.
శుకుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. “భాగవతము మణి లాంటిది. దేవతలు తెచ్చిన అమృతము గాజుపూస. వీటికి రెండింటికీ సామ్యము ఎక్కడ!" అని అనుకున్నాడు. దేవతలతో ఇలా అన్నాడు.
“మీరు కేవలము అహంకారతో ఇక్కడకు వచ్చారు. మీకు భక్తి లేదు. కాబట్టి మీకు భాగవత కథను ఇవ్వను.” అని అన్నాడు. ఆ కారణం చేత భాగవత కథ కేవలం మానవ లోకానికే పరిమితం అయింది. దేవతలకు అందుబాటులో లేదు.
తరువాత పరీక్షిత్ మహారాజు శుకుని వలన భాగవత కథను విని ముక్తి పొందాడు. అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక త్రాసును తెప్పించాడు. భాగవతమును ఒక పక్క, ఇతర మోక్ష సాధనములను ఒక పక్క వేసి తూచాడు. భాగవతము బరువుకు అవి వెలవెలబోయాయి. ఇది చూచి అక్కడ ఉన్న ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈకలియుగంలో కేవలం భాగవతమును చదివినంత మాత్రమున మోక్షము వస్తుంది అని వారిలోవారు అనుకున్నారు. ఈ భాగవతమును సప్తాహము గా అంటే ఏడు రోజులపాటు వింటే మోక్షము వెంటనే వస్తుంది అని నమ్మారు.
పూర్వము ఈ భాగవత పురాణమును సనకుడు మొదలగు ఋషులు దేవర్షి నారదునికి చెప్పారు. అప్పటికే బ్రహ్మగారు నారదునికి భాగవత పురాణమును వినిపించాడు. కాని సప్తాహవిధిలో
సనకాదులు నారదునికి చెప్పారు.” అని సూతి చెప్పగా, శౌనకుడు ఇలా అడిగాడు.
“భాగవతోత్తమా! నారదునికి, సనకాదులకు ఎలా కలిసింది. వారు ఎక్కడ కలుసుకున్నారు. భాగవతపురాణమును మరలావినాలనే కోరిక నారదునికి ఎలా కలిగింది. వివరంగా తెలియజేయండి." అని అడిగాడు. అప్పుడు సూతపౌరాణికుడు ఇలా చెప్పసాగాడు.
“ఒకనాడు విశాల పురి అనే ప్రదేశములో నలుగురు ఋషులు సత్సంగము చేస్తున్నారు. అప్పుడు నారదుడు అక్కడే ఉన్నాడు. నారదుని చూచి ఆ ఋషులు ఇలా అడిగారు.
“నారదా! నీ ముఖం ఎందుకో చింతాక్రాంతమై ఉంది. కారణం ఏమిటి? నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి ఇంత త్వరగా వెళుతున్నావు? నీ ముఖం చూస్తుంటే ఎంతో ధనం పోగొట్టుకున్న వాడి మాదిరి వెలవెలబోతూ ఉంది. నీ మనస్సు బాగా వికలమైనట్టు ఉంది. నీ వంటి వాడికి ఇలా ఉండటం ఉచితము కాదు. అసలు కారణం ఏమిటో చెప్పు?” అని అడిగారు. అప్పుడు నారదుడు వారితో ఇలా అన్నాడు.
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share