
జై శ్రీరామ్ జై హనుమాన్
June 15, 2025 at 06:37 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
• *శ్రీ శివ మహా పురాణము*
*శివుని ఫాలాగ్నియే సముద్రబడబాగ్ని*
శివుని ఫాలాగ్ని మన్మథుని దహించి మరొక ప్రయోజనం లేనిదై ముల్లోకాలను దహించటం మొదలు పెట్టింది. ప్రాణులన్ని పితామహుని శరణువేడగా ఆయన శంకరుని స్మరించి ఆ అగ్నిని స్తంభింప చేశాడు. దానిని సౌమ్యమగు జ్వాలలను వెదజల్లు ముఖంగల బడబ (గుర్రము)గా మార్చి వేసి సముద్రుని దగ్గరకు వెళ్ళాడు. సముద్రుడు పురుష రూపాన్ని ధరించి చేతులు జోడించి బ్రహ్మను స్తుతించి "నే నెరవేర్చగల కార్యమేమిటి?” అని కోరగా లోకహితాన్ని కోరి బ్రహ్మగారిలా అన్నాడు.
"ఓ సముద్రుడా! ఈ బడబాగ్నిని ప్రలయకాలం వరకు నువ్వు ధరించు. అప్పుడు నేను వచ్చి ఇక్కడ నివసిస్తాను. నువ్వు ఈ శంకర లలాటాగ్నిని ఆ సమయంలో విడిచిపెట్టు. ఇదెప్పుడూ నోట్లోంచి నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఈ అగ్నికి నీ జలాలే భోజనం కాగలదు. ఇది నీ గర్భంలోకి వెళ్ళకుండ జాగ్రత్త వహించు. ఇది జలాలను మాత్రమే దహిస్తుంది.”
అని చెప్పి బ్రహ్మగారు అంత బడబను సముద్రునకు అప్పచెప్పి తానుఅంతర్థానమయ్యాడు. లోకాలన్ని సంతోషించాయి.”
*పార్వతికి నారదోపదేశం*
సూతుడు తదనంతర వృత్తాంతాన్ని మునులకిలా చెపుతున్నాడు. మహాధ్వనితో పుట్టిన శివుని ఫాలాగ్నికీలలకు పార్వతి భయపడి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ఒడిలో తలపెట్టుకొని దుఃఖించింది. తాను పునర్జన్మను పొందినట్లు భావించింది. శివుని మీది ప్రేమచే ఎక్కడా సుఖాన్ని పొందలేక పోయింది. తన దురదృష్టాన్ని తానే నిందించుకొంది. ఎవరెంత ఓదార్చినా ఆమెకు దుః ఖోప శమనం కలుగ లేదు సరిగదా విరహ వేదన అధికం కాజొచ్చింది.
ఒక రోజున త్రిలోక సంచారం చేస్తూ నారద మహర్షి వచ్చారు. వచ్చిన మహర్షికి స్వాగత సత్కారాలు జరిపి గతమంతా వివరించి కర్తవ్యమేమని కోరగా, శివారాధనయే కర్తవ్యమని ఆయన గిరిరాజుకు బోధించాడు. పార్వతిని ఏకాంత మందిరంలోనికి తీసుకొని వెళ్ళి ఇలా ఉపదేశించాడు. “ఓ గిరిరాజ నందినీ! నీ మనోగతం నాకు తెలుసు. నువ్వు శంకరునికి సేవలు చేశావే, కాని తపస్సు చెయ్యలేదు. తపస్సువల్ల కాని కార్యం సిద్ధించదు. నిన్ను తప్ప ఆ శశాంక శేఖరుడు, అన్యస్త్రీ పాణిగ్రహణం చెయ్యడు.” అని భావి శుభాన్ని చెప్పి శివ పంచాక్షరిని ఉపదేశించి, ఈ మంత్ర మహిమచే శివుడు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడని చెప్పి తన ధామానికి వెళ్ళి పోయాడు.
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share