జై శ్రీరామ్ జై హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్
June 16, 2025 at 02:25 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *శ్రీమద్భాగవతమహాత్మ్యము* "అన్ని లోకముల కంటే భూలోకము సర్వోత్తమము అని తలంచి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నో తీర్థములను దర్శించాను. పుష్కరము, ప్రయాగ, కాశి, నాసిక్, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతువు, మొదలగు తీర్థములలో తిరిగాను. కాని ఎక్కడానా మనసుకు శాంతి కలుగలేదు. ఎందుకంటే ఈ కలియుగంలో అధర్మం పెచ్చరిల్లి ధర్మానికి నిలువనీడలేకుండా పోయింది. ఈ కలియుగంలో సత్యము, తపస్సు, శౌచము (పరిశుభ్రంగా ఉండటం) దయ, దానము ఇవన్నీ మచ్చుకైనా కనపడటం లేదు. మానవులు అందరూ కేవలం తమ పొట్ట నింపుకోడానికే ప్రయత్నిస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. ఏ పనీ చేయకుండా సోమరులుగా ఉన్నారు. వీళ్లకు బుద్ది అసలు పనిచేయడం లేదు. వీరి మొహాన అదృష్టం అసలు రాయబడలేదు. వీరిని అన్నిరకాల కష్టాలు చుట్టుముడుతున్నాయి. పేరుకు సాధువులుగా, వైరాగ్యం పొందిన వారిగా చెప్పుకుంటున్న వారు, అనేక అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్నారు. ఆడవారి వద్ద నుండి ధనము అపహరిస్తున్నారు. ఇళ్లలో ఆడువారిదే పెత్తనంగా సాగుతూ ఉంది. వారి అన్నదమ్ములు అంటే యజమాని బావమరుదులే సలహాలు ఇస్తున్నారు. కలియుగంలో మానవులు స్త్రీలను ధనానికి అమ్ముకుంటున్నారు. స్త్రీలు పురుషులు అకారణంగా తగవులాడుకుంటున్నారు. మహాత్ములు ఉండే ఆశ్రమములు, తీర్థములు, పుణ్యక్షేత్రములు దుర్మార్గుల అధీనంలో ఉన్నాయి. కొంత మంది దుర్మార్గులు ధనం కోసం దేవాలయములను ధ్వంసం చేసారు. కొల్లగొట్టారు. కలియుగంలో యోగులు, సిద్ధులు, జ్ఞానులు, మంచి పనులు చేసేవారు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆత్మజ్ఞానము గురించి ఎవరూ సాధన చేయడం లేదు. పైగా ఈ భూమి మీద అందరూ అన్నము అమ్ముకుంటున్నారు. బ్రాహ్మణులు తాము నేర్చుకున్న వేదవిద్యను అమ్ముకుంటున్నారు. స్త్రీలు వేశ్యావృత్తిలో జీవిస్తున్నారు. కలియుగంలో ఈ ఘోరాలు అన్నీ చూస్తూ నేను యమునా నదీతీరం చేరుకున్నాను. అక్కడ ఒక స్త్రీ విషాదంతో కూర్చుని ఉంది. ఆమె పక్కన ఇద్దరు వృద్ధులు నేలమీద పడుకొని ఉన్నారు. వారి ఒంటి మీద స్పృహ లేదు. వారి శ్వాస బరువుగా వస్తోంది. ఆ స్త్రీ ఏడుస్తూ వారికి సేవలు చేస్తూ ఉంది. వారికి స్పృహ తెప్పించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైనా వచ్చి తనకు సాయం చేస్తారా అని దిక్కులు చూస్తూ ఉంది. ఆమె చుట్టు కొంత మంది స్త్రీలు నిలబడి ఆమెకు విసన కర్రలతో విసురుతున్నారు. ఆమెను ఊరడిస్తున్నారు. ఈ విషయం అంతా నేను దూరంనుండి చూచాను. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాను. నన్ను చూడగానే ఆమె లేచి నిలబడింది. నాతో ఇలా చెప్పింది. “ఓ మహాత్మా! ఒక్క క్షణం ఆగండి. నా దుఃఖమును తొలగించండి. మీ దర్శనభాగ్యంతోనే లోకంలో ఉన్న అన్ని చింతలు నాశనం అవుతాయి అని అంటారు. మీ మాటలు నాకు కొంత ఉ పశమనమును కలిగిస్తాయి.” అని పలికింది. అప్పుడు నారదుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ దేవీ! నీవు ఎవరు? ఈ ఇద్దరు నీకు ఏమవుతారు. నీకు వింజామరలు వేస్తున్న ఈ స్త్రీలు ఎవరు? నీవు ఈ ప్రకారంగా దుఃఖించడానికి కారణం ఏమి? అన్ని వివరములునాకు సవిస్తరంగా చెప్పు." అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ నారదునితో ఇలా చెప్పసాగింది. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

Comments