Vasamsetti Subash
June 21, 2025 at 06:14 AM
*యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యం*
- *కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం గారు*.
* *రామచంద్రపురంలో విజయవంతంగా యోగాంధ్రా-2025*
*రామచంద్రపురం, జూన్ 21*:యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం గారు అన్నారు. శనివారం రామచంద్రపురంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా స్థానిక కృత్తివేంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం గారు మాట్లాడుతూ యోగాతో మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నారు. ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, అందరూ తమ ఆరోగ్యం కోసం యోగా దినచర్యలో భాగం చేసుకొని శారీరక, మానసిక ఒత్తిడిని జయించేందుకు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. గిన్నిస్ బుక్ రికార్డులు లక్ష్యంగా, యోగాంధ్రలో 22 వరల్డ్ బుక్ ల రికార్డు కోసం కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ రాజు, చైర్ పర్సన్ రాధమ్మ శెట్టి శ్రీదేవిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేయాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. సమాజంలో వున్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యోగా కార్యక్రమాన్ని ఒక నెల రోజులు పాటు నిర్వహించి ప్రజలందరికి ఆరోగ్యం ఉండేటట్లు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ప్రజలు నిత్య జీవితంలో యోగ ఒక భాగం చేయాలన్నారు. అందరూ యోగాను సాధన చేయాలని, యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆధునిక జీవన శైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. యోగ, ధ్యానం సాధన చేయడం ద్వారా వీటిని దూరం చేయొచ్చన్నారు.
జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వo అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర -2025 కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించిందన్నారు. ఈ యోగ విజయవంతంగా జరగడానికి సహకరించిన అధికారులకు, సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🙏
1