Vasamsetti Subash
June 21, 2025 at 02:14 PM
*రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే ఉపేక్షించం* *జగన్ అండ్ టీంకు యోగా అత్యవసరం* *యోగాతో జగన్ మానసిక స్థితి కుదుటపడుతుంది* *అసాంఘిక శక్తులకు ఓదార్పు యాత్రలా*..! *యోగాంధ్రతో ప్రపంచం ఆంధ్ర వైపు చూస్తుంది* *రాష్ట్రంలో జగన్ సినిమా ముగిసింది -శుభం కార్డు పడింది* *మీడియాతో మంత్రి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు*. *రామచంద్రపురం జూన్ 21*: రాజకీయం మూసుకులో రౌడీయిజం చేస్తే సహించేది లేదని, జగన్ లండన్ మందులు వికటించిన నేపథ్యంలో జగన్ అండ్ టీంకు యోగా అవసరమని, యోగాతో కచ్చితంగా మానసిక స్థితి కుదుటపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం రామచంద్రపురంలో క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగులుగా చెబుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా పరామర్శ యాత్రలు చేపట్టి కొట్టండి, చంపండి, వార్ డిక్లేర్ అంటూ చేసే హింసా నినాదాల్ని ఇస్తున్నారని దీన్ని సమాజం క్షమించదన్నారు. సినిమాల్లో మనుషుల్ని చంపే డైలాగులు సమర్థిస్తూ తన వ్యాఖ్యల్లో తప్పేముందని సమర్ధించుకోవడం హాస్యాస్పదమన్నారు. జగన్ కు ఇదేం మానసికస్థితి, ఇదేం రోగమంటూ ఎద్దేవా చేశారు. జగన్ కు లండన్ మందులు పనిచేయలేదు.. కనీసం యోగాతోనైనా ఆరోగ్యం సక్కబడుతుంది.. యోగా ప్రాక్టీస్ చేయండని సూచించారు. రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు యోగా పట్ల అవగాహన పెంపొందించుకున్నారని, జగన్ అండ్ టీం కూడా యోగ చేస్తే మానసిక స్థితి కుదుటపడుతుందిని చలోక్తులు విసిరారు. 3 లక్షల మందికి పైగా చేసిన యోగాంధ్ర నిర్వహణపై ప్రపంచమంతా ఆంధ్ర వైపు చూస్తోందని, పీఎం మోడీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో యోగాంద్ర ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కిందన్నారు. జగన్ హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపుతూ కొట్టండి, చంపండి అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాజకీయనాయకుడికి, రాజకీయ పార్టీకి ఈ తరహా పోకడలు లేవని ఆశ్చర్య వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమని, గంజాయి, బెట్టింగ్ బ్యాచ్ లు, రౌడీలకు విగ్రహాలు పెడుతూ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడి గురించి ఆలోచించాలన్నారు. తాను ఇంకా సీఎం అనే భ్రమలోనే జగన్ ఉన్నారని, ఊహల్లో నుంచి బయటపడాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి హింసా రాజకీయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగన్ ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపాలని లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. వైసీపీకు ప్రజలు ఎప్పుడో సినిమా చూపించి, శుభం కార్డు వేశారని మంత్రి సుభాష్ అన్నారు.
Image from Vasamsetti Subash: *రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే ఉపేక్షించం*   *జగన్ అండ్ టీంకు యోగా అ...
🙏 👍 3

Comments