Vasamsetti Subash
June 21, 2025 at 03:30 PM
*మూడు కుటుంబాలకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేసిన మంత్రి సుభాష్* *రామచంద్రపురం జూన్ 21*: ఆర్థిక పరమైన కష్టాలతో ఇబ్బందులు పడుతున్న మూడు కుటుంబాలకి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్థిక సహాయం అందించి ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారు. వివరాల్లోకెళ్తే రామచంద్రపురంలోని రాజబాబు నగర్ కు చెందిన అయినవిల్లి స్వర్ణ ఇటీవల తన భర్తను కోల్పోయి ముగ్గురు పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. స్వర్ణ ఆర్థిక స్థితిని కూటమి పార్టీ నాయకులు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ప్రతినెల రూ.5 వేలు ఆర్థిక సహాయం అందిస్తానని, టిడ్ కో గృహ సముదాయంలో ఒక ఫ్లాట్ ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మానవత్వానికి, సహాయ గుణానికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే స్థానిక 16 వార్డు చప్పిడివారి సావరంకు చెందిన ఎర్రగంటి శ్రీదేవి కుమారున్ని వీధి కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేలు చెక్కు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఐదో వార్డు రాజబాబు నగర్ కు చెందిన ఇందుర్తి సురేష్ కుటుంబానికి రూ. 20 వేలు వెరసి మొత్తం రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించారు. మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని మంత్రి సేవా నిరతని ప్రశంసించారు.
🙏 ❤️ 10

Comments