Bhakthi Tv

Bhakthi Tv

28.3K subscribers

Verified Channel
Bhakthi Tv
Bhakthi Tv
June 14, 2025 at 12:42 AM
14th June 2025 *సంకష్టహరచతుర్థి* : చతుర్థి తిథి వినాయకునికి సంబంధించినది. ఆనాడు స్వామిని ఆరాధించాలి. జీవితంలో అనుకున్న పనులు పూర్తికాకుండా అనేక ఆటంకాలు కలుగుతున్నప్పుడు... సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేపడితే నెరవేరుతాయని నమ్ముతారు. ప్రతిమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈ వ్రతాన్ని చేపట్టేవారు 3, 5, 11 లేదంటే 21 నెలలపాటు నిర్వహించవచ్చు. మనసులోని కోరికను స్వామిముందు చెప్పుకుని ముడుపు కట్టాలి. మూడు గుప్పిళ్ల బియ్యాన్ని, తమలపాకులు, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలను, ఒక రూపాయి దక్షిణను జాకెట్టు ముక్కలో మూట కట్టడమే ముడుపు కట్టడమంటే. అలా ముడుపు కట్టిన తరువాత, స్వామిని పూజించి ప్రతకథ చదువుకోవాలి. అటుతర్వాత ఆలయానికి వెళ్లి స్వామికి ప్రదక్షిణలు చేయాలి. వ్రతనియమం పూర్తయిన తరువాత ముడుపును ఆలయంలో సమర్పించాలి. ఇలా ఆచరించిన వారికి అడ్డంకులు తొలగి అనుకున్నవన్నీ పొందుతారు.
Image from Bhakthi Tv: 14th June 2025 *సంకష్టహరచతుర్థి* :  చతుర్థి తిథి వినాయకునికి సంబంధించి...
🙏 ❤️ 🪔 27

Comments