
Mannam Web 🌎 Joy Of Sharing ...
June 18, 2025 at 07:23 AM
లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మెన్, పత్రిక ప్రకటన - తేదీ 18 జూన్ 2025, వెలగపూడి:
అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నివాస భవనాల కోసం
కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఆంధ్ర కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నివాస భవనాల కోసం
కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) ప్రాజెక్టు క్రింద కేంద్ర ప్రభుత్వం రూ. 2,787 కోట్లను మంజూరు చేయడం ద్వారా వేగంగా రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు అమరావతి నుంచి జరగాలనే స్ఫూర్తి కనబడుతుంది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నివాస భవనాల కోసం రూ.1,329 కోట్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మాణానికి రూ.1,458 కోట్లు కేటాయించడం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిపాలన భవనాలు మరియు అధికారుల నివాస సముదాయాలు అతి త్వరగా పూర్తి అయ్యి సేవలు అందించడానికి కార్యాచరణ జరుగుతుంది.
త్వరలో 50 కి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం అమరావతిలో పూర్తి అయ్యి ప్రజలకు సేవలు అందించేందుకు వేగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాజధాని అమరావతి నిర్మాణం కోసం 2014- 19 మధ్య 2,500 కోట్ల గ్రాంట్ మరియు 2024 అనంతరం 15 వేల కోట్ల రూపాయల సహాయం, 11 వేల కోట్ల హడ్కో రుణం, 25 వేల కోట్ల ఓఆర్ఆర్, 3 వేల కోట్ల రైల్వే లైన్, స్మార్ట్ సిటీ మరియు హెరిటేజ్ సిటీ నిధులను సహాయం చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజధాని అమరావతి పూర్తి సంకల్పానికి "ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో మోడీ - మోడీ మదిలో ఆంధ్రప్రదేశ్ " అనే భావనతో ప్రధాని నరేంద్ర మోడీ గారు పని చేస్తున్నారు.
👍
😢
2