
GouthamaISM
June 22, 2025 at 06:05 AM
• ఎక్కడివీ ఆలోచనలు?
లోచనాలు ఉన్నా, లేకున్నా మనిషికి ఆలోచనలు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆలోచనలు లేని జీవనం, ఆనందం లేని భావనం వ్యర్థం అంటారు పెద్దలు.
పుట్టిన ప్రతిమనిషీ బుద్ధి తెలిసిననాటి నుంచి ఆలోచించడం ప్రారంభిస్తాడు. తానెవరో, తాను ఎందుకీ భూమిపై పుట్టాడో, తాను ఏమి చేయాలనుకుంటున్నాడో, ఆ విషయాలను అన్నింటిని గురించి మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు. ఒక్క నిద్రలో తప్ప, మేల్కొని ఉండే అన్ని సమయాలలోనూ, సందర్భాల్లోనూ మనిషి ఆలోచించకుండా ఉండలేడు.
‘నేనెవరు, ఎక్కడినుంచి వచ్చాను, నేను ఏం చేయాలి?’ ఇత్యాది ప్రశ్నల పరంపరల్లో నుంచే అనేక మతాలు ఆవిర్భవించాయి. మానవుడి చరమగమ్యాన్ని నిర్దేశించాయి. ఎన్నో దారులను సృష్టించాయి.
#gouthamavenkataramanaraju
