Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
June 17, 2025 at 05:41 AM
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం : మహేందర్ రెడ్డి
ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం యాలాల్ మండలం అగ్గనూరుకు గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటయ్య, ఉప్పరి కల్పన లు గతంలో అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆర్థికంగా ఇబ్బందుల పాలై ఆదుకోవాలని కోరిన
నేపథ్యంలో వారికి 82,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి( సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తమ బాధ్యతని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. వెంకటయ్య కుటుంబానికి రూపాయలు 40,000, కల్పన కుటుంబానికి రూపాయలు 42 వేల చెక్కులను ఆయన అందించారు. అవసరమైతే మల్లి ఇంకా సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
తగునూరు చెందిన శాంతు, వెంకటయ్య, శివ తదితరులు ఉన్నారు.
🙏
1