Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
June 18, 2025 at 10:25 AM
ఏనుగు జంగారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల పిసిసి పునర్వ్యవస్థీకరణలో భాగంగా అందులో చోటు దక్కించుకున్న రంగారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో జంగారెడ్డి బంజారాహిల్స్ లోని మహేందర్ రెడ్డి ని వాసంలో మొదటిసారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జంగారెడ్డికి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా జంగారెడ్డి సైతం మహేందర్ రెడ్డికి శాలువ కప్పి, బొకే అందించి, ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నుండి పీసీసీలో స్థానం సంపాదించిన పలువురికి సైతం మహేందర్ రెడ్డి అభినందించారు. ఏ పార్టీలో అయినా పనిచేసే వారికి గౌరవం, పదవులు దక్కుతాయని, అందులో నాయకులను ప్రోత్సహించడంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత ముందు ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: ఏనుగు జంగారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన పట్నం మహేందర్ రెడ్డి   ఇటీవల ...

Comments