BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
May 25, 2025 at 02:05 PM
బహుజన సమాజ్ పార్టీ లో క్రమశిక్షణతో కూడిన క్యాడర్ ఉంటది.. 👉🏿 నువ్ ఎంత తురుమ్ అయినా క్యాడర్ మొట్టికాయ వేస్తుంది. 👉🏿 తప్పటడుగులు వేస్తే పక్కకెళ్ళి ఆడుకోండని స్పష్టంగా బయటకు పంపిస్తుంది... 👉🏿 నాకు పార్టీ కేడర్ గా, చాలా ప్రశ్నలు ఉన్నాయి..! పార్టీ నుండి బయటకి వెళ్లిన వాళ్లు లేదా వాళ్ల తరఫున వకాలత్ పుచ్చుకున్న ఎవరైనా సమాధానాలు చెప్పొచ్చు.. 1 , అసలు మీరు అనుకునే నాయకుడు ఎప్పుడైనా ఒక ప్రొడక్టివ్ బాబాసాహెబ్ అనుకున్న క్యాడర్ ని తయారు చేయాలనుకున్నాడా ?? 2 , పార్టీ లైన్లో కనీసం తెలంగాణ/ఆంధ్రా లో ప్రోటోకాల్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా !? 3 , ఎందుకు లోప్రొఫైల్లో క్యాడర్ తయారు చేసే ప్రయత్నం చేయలేరూ!?ఒకవేళ చేస్తే ఎక్కడ చేశారు కాస్త వివరించండి ! 4 , ఎంతసేపు సోషల్ మీడియా కవరేజ్ లు హంగు హార్భాటాలుగా కార్యక్రమాలు తప్ప, కనీసం చిన్న చిన్న లక్ష్యాలను కూడా అధిగమించారా (సాహెబ్ కాన్షిరామ్ గారి పనిలో)!? 5 , ఎంత క్యాడర్ బేస్డ్ మూమెంట్ చేశారు, ఎంత క్యాడర్ మీ తయారుచేసి పార్టీ నీ బలోపేతం చేశారు !? 6 , ఎన్ని వందల మండల స్థాయి కార్యక్రమాలు జరిపారు !? 7, అసలు ఎన్నిసార్లు బాబాసాహెబ్ మిషన్ కు సంబంధించిన ఒక మిషన్ బేస్ స్పీచ్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పి రాజకీయతర ఉద్యమానికి మరియు రాజకీయ ఉద్యమానికి సంసిద్ధం చేశారు! 8 , సామాజిక ఉద్యమ పరివర్తన ముచ్చట్లు ఎక్కడ కూడా చర్చలోకి రానివ్వలేదు వస్తే ఒకటి రెండు చెప్పండి. 9 , ఎంతసేపు ఆధిపత్యకుల పార్టీ పోకడలను సొంత పార్టీలో రుద్ది సీనియర్ల మాటలు వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరు ఎంత దూరం పార్టీని దిగజార్చాలని చూసారో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్పష్టంగా గమనిస్తూనే ఉంది. 10 , వెరసి బాబాసాహెబ్ త్యాగాన్ని,ఉద్యమాన్ని కాన్షిరామ్ గారి పని విధానంలో కొనసాగించకుండా మీ సొంత నిర్ణయాలు ఊహాగానాలు తప్ప ఏం అభివృద్ధి చేశారు తెలియజేయండి.. ఇప్పుడు ఎవరెవరు పార్టీ నుండి ఏ ఏ కారణాలతోని బయటకు వెళ్లారు ! ఎందుకు పార్టీ బయటికి మీ మీ నాయకులను పంపించిందో వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత ఆధారాలతో కూడిన అన్ని విషయాలు చర్చిద్దాం.... జై భీమ్ Karunakar Bahujan #teambsfi
👍 ❤️ 5

Comments