
BSFI - Bahujan Students' Federation Of India
May 26, 2025 at 04:15 PM
ది.26.05.25
కృష్ణా విశ్వవిద్యాలయం,
మచిలీపట్నం.
చారిత్రాత్మక మచిలీపట్నం లో కృష్ణా విశ్వవిద్యాలయం ను ఏర్పాటు చేసి ఏప్రిల్ 28, 2025 నాటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 వ ఏడాది లోకి ప్రవేశించింది. పుష్కర కాలం పాటు ఆంధ్ర జాతీయ కళాశాల లో కాలం వెళ్లదీసి 5 ఏళ్ల క్రితం నూతన (సొంత) ప్రాంగణం లో కి ప్రవేశించడం సంతోషకరమైన అంశం.
విశ్వవిద్యాలయం స్థాపించి 17 ఏళ్లు అయినా, సొంత ప్రాంగణం లో కి చేరి 5 ఏళ్లు గడిచినా ఇంకా బాలారిష్టాలు దాటకపోవడం శోచనీయం. ఆధిపత్య కులాలకు చెందిన వారు ఉపకులపతులుగా, రిజిస్ట్రార్ లు గా ఎక్కువ కాలం పనిచేయడం ఇందుకు కారణమని స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు బాలబాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులు ఉన్నత విద్య కు దూరం చేయబడ్డారు. ఇది ఆధిపత్య కులాలకు చెందిన ఉపకులపతులు, రిజిస్ట్రార్లు కుట్ర గా భావించాల్సి వుంటుంది. 16 సంవత్సరాలు తరువాత తొలిసారి బహుజన వర్గానికి చెందిన తమరు ఉపకులపతి గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషకరం. సమస్యల పరిష్కారం లో మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.
పునాది దశలో నిలిచిపోయిన బాలుర వసతి గృహం నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించాలి.
విశ్వవిద్యాలయ ప్రాంగణం లో క్రీడా ప్రాంగణం ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలి.
కార్లు, ద్విచక్ర వాహనాలు నిలుపుటకు అధ్యాపకులకు, విద్యార్ధులకు విడివిడిగా స్టాండ్లు నిర్మించాలి.
విశ్వవిద్యాలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద బస్ షెల్టర్ నిర్మించాలి అని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా డిమాండ్ చేస్తుంది
