
Voice Of Maheedhar (Planet Leaf)
June 15, 2025 at 05:45 PM
నాన్న..
“నాన్న” అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు.
నాన్న చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో ఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో..
’నాన్న.. నాన్న.. నాన్న’ అని మూడు సార్లు పిలవమంటారు.
కొడుకు రెండు సార్లు బాగానే పిలుస్తాడు..!
మూడోసారి మాట రాదు. గుండెలో బాధ , గొంతులో తెలియని నొప్పి , కళ్ళల్లో నీళ్ళు.
ఎందుకంటే...ఆ కొడుకు తండ్రిని నాన్న అని నేరుగా పిలిచేది అదే ఆఖరిసారి. ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు.!
ఆ పిలుపు తనకి Just Half Second మాత్రమే పట్టింది...!
కానీ...
ఆ Half Second లో వాడికి మొత్తం కళ్ళముందు కనిపించేది మాత్రం...
“మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది!
మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్ కి వెళ్ళకుండా మన Future కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి.
చివరగా ఎవరైనా ‘నువ్వు ఏం సంపాదించావురా?’ అని నాన్న ని అడిగేతే...’నా ఆస్తి నా కొడుకురా!’ అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది!“
ఇవ్వన్నీ కనిపించిప్పుడు నాన్న ని గట్టిగా హత్తుకుని “నాన్న నాన్న నాన్న నాన్న నాన్న నాన్న” అని పిలవాలని అనిపిస్తుంది.
కాని... అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా... అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు.
So నాన్న ఉన్నప్పుడే తనని “నాన్న” అని ప్రేమగా పిలుద్దాం…!
నాన్న పోయాక ఆయన ఫోటో దగ్గర కూర్చుని బాధపడే బదులు....
నాన్న ఉన్నపుడే తనతో రోజూ కొంత టైం గడుపుదాం!
ఆయన పోయాక FB లో “my dad is my hero” అనే post లు పెట్టే బదులు... నాన్న ఉన్నప్పుడే నాన్న తో “నాన్న U are my hero” అని చెప్పుదాం.
అంత గొప్ప “నాన్న”అనే పదాన్ని కించపరచకండి.
“తన జీవితాన్ని ఖర్చుపెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న!
మారండి మారటానికి ప్రయత్నించండి! మన తల్లి-తండ్రులను సుఖః సంతోషాలతో ఉండేలాగా చేద్దాము!

❤️
🙏
3