
BUYYANI MANOHAR REDDY
May 25, 2025 at 12:16 PM
రేవంత్ రెడ్డి గారి ఆశయానికి మనోహర్ రెడ్డి గారి ఆచరణ..
ప్రతి కుటుంబానికి ఉద్యోగం అన్న ఆశయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు.. సీఎం గారి ఆశయానికి అనుగుణంగా ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
మే 29న తాండూరులోని వినాయక కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ మేళాలో 50కి పైగా ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. దాదాపు 10 వేల ఖాళీల భర్తీకి ఈ సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా యువతను భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలన్నదే మా లక్ష్యం అంటూ వెల్లడించారు.
ఇక ఈ జాబ్ మేళాలో మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్, నర్సింగ్, ఫార్మసీ, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉండగా, ఎంప