
Real Mystery Telugu
239 subscribers
About Real Mystery Telugu
~ Welcome All ~ పారానార్మల్ సంఘటనలు, హార్రర్ స్టోరీస్, మిస్టరీస్, గ్రహాంతర వాసుల మూలాలు, స్టోరీస్ రూపంలో ఇక్కడ Explore చేయ్యబడతాయి
Similar Channels
Swipe to see more
Posts

అమెజాన్ అడవుల లోపల ఎన్నో మర్మమైన రహస్యాలు బయటకు తెలియనివి నిండి పొయ్యి ఉన్నాయి ఆ అడవి లోపలికి వెళ్ళిన తరువాత వెలుగు మందగించినప్పుడు చీకటి అన్నీ వైపులను కమ్మేసిన చోట ఒక బిడ్డ ఏడుపు వినబడుతుంది ,అది ఖచ్చితంగా 'టియానక్' అనే ఎలిమెంటో పని. ఆ ఏడుపు ఎక్కడి నుండి వస్తుందో అని అనుసరిస్తూ ముందుకు వెళితే ఆ అడవి మధ్యలో ఒక నిస్సహాయ చిన్న బిడ్డ కనబడుతోంది అంటారు.దానిపై జాలి పడి ఎత్తుకుని గనుక మోసుకు వెళితే అది ఒక రాక్షసుడిగా మారి మిమ్మల్ని మ్రింగివేస్తుంది.ఆ బిడ్డ ఏలా ఉంటుందో తెలుసా ? అచ్చం ఈ ఫొటోలో ఉన్న విధంగా


( ఇది మన ఫాలోవర్స్ లో ఒకరి అనుభవం జరిగింది మొత్తం ఆమె మాటల్లోనే విందాం ) మా నాన్న ఆర్థికంగా స్థిరపడ్డారు.వ్యాపారంలో బాగా ఎదిగారు.చిన్నప్పటి నుండీ నన్ను తమ్ముడిని ఏ లోటు లేకుండా బాగా చూసుకున్నారు. చక్కని కుటుంబం అప్పటి వరకు సంతోషాలతో నిండి పోయింది కాలం అంతా,ఏ బాధలు లేని మా జీవితాలను చూసి విధి ఈర్చ పడినట్టు ఉంది పగల తరువాత రాత్రి వచ్చినట్టు మా బ్రతుకులలోకి కూడా ఓ చీకటి రోజు వచ్చింది. మా రెండో కొత్త ఇల్లు, మూడంతస్తుల భవనం ఎంతో ముచ్చట పడి కట్టించారు నాన్న. గృహ ప్రవేశం జరిగి నెల రోజులు అయ్యింది అంతే, దగ్గర బంధువుల పెళ్ళి. కుటుంబం మొత్తం రావాలి అని పట్టుబట్టారు. అయ్యిన వాళ్ళు అవ్వడంతో మేము కూడా కాదనలేక సంతోషంగా అందరినీ పెళ్ళిలో కలుసుకొని ఆనందంగా గడిపాము.నాలుగో రోజు కారులో ఇంటికీ చేరుకున్నాము ఎక్కువ దూరం జర్నీ చెయ్యడంతో అందరి మొఖాలు కూడా అలసటతో అంతంత మాత్రం నిద్రతో వాడిపొయ్యి కళ్ళు బలవంతంగా తెరుచుకుంటున్నాయి.నాన్న ముందు కార్ దిగి డోర్స్ ఓపెన్ చేశారు మేము కూడా కిందకు అడుగుపెట్టి బ్యాక్ డోర్ తెరిచి మా బ్యాగ్గులు తీసుకున్నాము. గేటు ఓపెన్ చేసి ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఎదో కొత్తగా ఒళ్ళు జలదరించింది నాకు.నా పక్క నుండే ఎవరో నడుచుకుంటూ వెళ్లినట్లుగా అనిపించడంతో వెనక్కు తిరిగి గేటు వైపే చూస్తున్నాను నేను.ఇంతలో పెద్ద అరుపు అది మా అమ్మది,ఉలిక్కిపడి ఏం జరిగిందా అని పరుగులు తీసాము ఇంటి లోపలికీ.డోర్ విరిగిపొయ్యి ఉంది.ఇంట్లో లైట్లు వెలగడం లేదు ఎందుకంటే.కరెంట్ సప్లయ్ ఎవరో కట్ చేశారు.లోపల ఫ్లోర్ మీద ఎర్రని మరకలు,తరువాత తెలిసింది అది రక్తమని.నడి ఇంట్లో పెద్ద ముగ్గు గీసి పసుపు కుంకుమ,పగిలిన కుండ నెత్తురు వాటి మధ్యలో భయంకరమైన బొమ్మ పదునైన కర్ర పుల్లలతో ఆ మట్టి బొమ్మను మొత్తం గుచ్చి ఉంది.నిజానికి అది చేతబడి .మా నాన్నంటే గిట్టని వాళ్ళు చేశారు అది.విషయం బయటకు తెలియకుండా అదంతా శుభ్రం చేసి తెలిసిన పోలీస్ ఆఫీసర్ అంకుల్ కి పరసనల్ గా కాల్ చేసి మాట్లాడతా అన్నారు నాన్న ఖంగారుగా వెంటనే ఒక పాత గుడ్డలో ఆ చేతబడిలో ఉన్నవి అన్నీ మా నాన్న మా నాయనమ్మ ఎత్తడం మొదలు పెట్టారు సహజంగా నాన్న ఇలాంటివి నమ్మరు.మా అమ్మ వద్దు వాటిని ముట్టుకోవడం మంచిది కాదు అని చెబుతున్నా ఆయన వినలేదు మొత్తం మూటకట్టి తీసుకెళ్ళి ఆయన ఎక్కడో వాటిని పారేసి వచ్చారు.అసలు చేతబడి ఎవరికి చేశారో ఎందుకు చేశారో ఆలోచిస్తేనే భయంతో ఒళ్ళు కంపిస్తుంది.చెమటలు పట్టేసాయి.మేమంతా ఖంగారుగా ఉన్నా ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి పడుకోవడానికి గదికి వెళ్ళాను.కానీ నిద్ర పట్టట్లేదు.ఇంట్లో ఏవేవో శబ్దాలు ఎప్పుడూ విననివి వినిపిస్తూ ఉన్నాయి. కరెంట్ అర్ధరాత్రి కాగానే పొయ్యింది.అంతా చీకటి దుప్పటి మెడ వరకు కప్పుకున్నాను భయంతో గుండె ఆగి పోయ్యేలా ఉంది.ఇంట్లో బాధాకరమైన సన్నని మూలుగు అది మా నాయనమ్మది అనుకున్నాను కాదని తర్వాత తెలిసింది.నేను వారిని ఎంత పిలిస్తున్నా ఒక్కరూ పలకడం లేదు.నాకు ఆ క్షణాన తలుపు తీసుకొని బయటకు వెళ్ళేంత ధైర్యం అస్సలు లేదు దుప్పటిని మధ్య మధ్యలో కిందకు లాగి నా రూమ్ డోర్స్ వంక చూస్తూ ఉన్నాను.గుండె భయంతో నీరు పట్టేసింది ఆ నైట్ కంటికి అస్సలు నిద్ర లేదు తెల్లారింది..అమ్మ నేను ఇంకా తమ్ముడు లేచి లేవగానే హాల్ లోకి వచ్చేసాము కానీ నాన్న, నాయనమ్మ , రాలేదు.మేము పిలుస్తున్నా వాళ్ళు అస్సలు పలకట్లేదు వెంటనే వారి రూమ్స్ లోకి వెళ్ళి చూసిన మాకు ప్రపంచం స్తంభించి పొయ్యింది వారు ఇద్దరూ చనిపొయ్యారు


బీహార్ ఒరిస్సా బోర్డర్ లో అత్యంత డేంజెర్ గా ఉండే ఓ హైవే ఉంది ఇది ముఖ్యంగా కారుల్లో వెళ్ళే వారికి మరింత భయంకరమైనది ఆ హైవే సింగిల్ రోడ్డు రాత్రి పూట నూటికో కోటికో ఒక వాహనం తిరుగుతూ ఉంటుంది అక్కడ కారుల్లో ప్రయాణించే వారికీ హఠాత్తుగా వారి టైరులు పేలిపోతాయి లేదా రోడ్డుకి అడ్డంగా ఏదొక చెట్టు విరిగి పడి ఉంటుంది లేదా ఎవరైనా సహాయం చెయ్యమని లిఫ్ట్ అడుగుతూ రోడ్డు పక్కన నిలబడి ఉండొచ్చు పొరబాటున కారు ఆపారో చావడం ఖాయం అక్కడే మాటు వేసిన దొంగల ముఠా మారణాయుదాలతో ఒక్కసారిగా విరుచుకు పడి విచక్షణా రహితంగా చంపి విలువైనవి దోచుకు పోతారు పిల్లలు పెద్దలు అనే తేడా ఉండదు వారికీ ఇప్పటికీ అక్కడ చనిపొయ్యిన వారి కేకలు ఆ చీకట్లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి అంట..


పూణేకు చెందిన 16 ఏళ్ళ ప్రతిమేష్ జాజు అనే కుర్రాడు, చందమామ ఫోటోలను హై రెజల్యూషన్ తో తీసి ప్రపంచాన్ని అబ్బురపర్చాడు.. ఇప్పటి వరకు ఇంత క్లారిటీగా చందమామను ఎవ్వరు ఫోటోలు తీయలేదు... టెలిస్కోప్, స్కై వాచర్ సాయంతో పాటు సొంతంగా తయారు చేసుకున్న మరి కొన్ని పరికరాలతో ఈ అద్భత సృష్టించాడు ప్రతిమేష్.. మే నెలలో ఓ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చంద్రుడిని ఫోటోలు తీసిన ప్రతిమేష్ ఎంత జూమ్ చేసినా బ్లర్ కాకుండా చంద్రుడి స్వరూపం కనపడేలా తీసిన ఘనత సాధించాడు ప్రతిమేష్.. ఈ ఫోటోలు ప్రపంచాన్నే షే క్ చేస్తున్నాయి.. చందమామను దగ్గరనుంచి చూసిన అనుభూతి ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తున్నదని ప్రపంచ మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు..


మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🔱🪷 ఆహ్ పార్వతి పరమేశ్వరుల అశీసులు ఎల్లపుడూ మీపై ఉండాలని కోరుకుంటూ శివోదయం 🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️