
Bomma Maheshkumar goud
6.7K subscribers
About Bomma Maheshkumar goud
Official Channel of Bomma Mahesh kumar Goud Garu , President TPCC & MLC
Similar Channels
Swipe to see more
Posts

ప్రకటన.. స్క్రోలింగ్స్. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ..టీపీసీసీ అధ్యక్షులు, 1.SLBC దగ్గరకు హరీష్ రావు బృదం వెళ్లి హడావిడి చేసి పత్రికలకు ఫోజు ఇవ్వడం కాదు ..కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా నైనా ఒక్క మీడియా ప్రతినిధినైనా అక్కడకి అనుమతి ఇచ్చారా!..కిలో మీటర్ల దూరంలో ఆపేసిన చరిత్ర మీది దీనిపై చర్చకు సిద్ధమా ! 2..మీరు ఏ సమన్వయం తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో! చెప్పాలి! అంత సమన్వయం తో నిర్మించిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందో హరీష్ రావు చెప్పగలడా ? దాని పై చర్చకు సిద్ధమా? 3.దేశం లో ఉన్న అనుభవం ఉన్న అన్ని రంగాల రెస్క్యూ టీమ్స్ ను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన పని చేయిస్తుంటే ఏమి చేయాలో అర్ధం కాక చేష్టలు ఉడికి కోడు గుడ్డు పై ఈకలు పని హరీష్ రావు పెట్టుకున్నాడు..దానిలో భాగమే సమన్వయం లేదు అని హరీష్ రావు మాట్లాడుతున్నాడు.. 4.ప్రతిది రాజకీయం చేయడం శవాల పై పేలాలు ఏరుకోవడం BRS పరిపాటి అయ్యింది..ప్రమాదం జరిగింది రిస్క్యూ టీమ్స్ రౌండ్ థి క్లాక్ కష్టపడుతున్నారు నిరంతరాయంగా మంత్రులు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు..మీడియా పారదర్శికంగా ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తుంది..అక్కడకు వెళ్లి హడావిడి చేసి వారి పనికి ఆటంకం కలిగించకూడదు అనే ఇంకితం కూడా లేకుండా పైగా ఆయన ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మాజీ మంత్రులను MLA లను వెంట బెట్టుకొని మంది మార్బలం తో వెళ్లి హడావిడి చేయడంమే కాకుండా రోడ్డు పై బైఠా యించడం సిగ్గు చేటు 5. మీరు ఏ నిపుణులను అడిగి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారో ఎందుకు కూలిపోయిందో చెప్పగలరా? 6. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంలో ప్రాణాలు పోలేదా? 7. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం బాహుబలి మోటార్లు వరద నీటిలో ఎందుకు మునిగాయో హరీష్ రావు చెప్పగలడా! 8. ఏది పడితే అది మాట్లాడటం హరీష్ రావు కి అలవాటు అయ్యింది

బిగ్ బ్రేకింగ్స్. . రేపు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం సమయంలో మార్పు.. అనివార్య కారణాల వల్ల ఉదయం 11 గంటలకు బదులుగా మద్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం.. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం..

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారికి ఘన స్వాగతం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ గారు, ఫహీం గారు, రచమల్ల సిద్దేశ్వర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల సమక్షంలో ఘన స్వాగతం పలికారు. ఈ రోజు గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన జరిగే సమావేశంలో తొలిసారి పాల్గొననున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత బలాన్నిచ్చే సందర్భం. #TPCC #MaheshKumarGoud #MeenakshiNatarajan #Congress #Telangana

https://www.dishadaily.com/telangana/tpcc-chief-mahesh-kumar-goud-fired-on-former-minister-harish-rao-416932
