Mahanaadu Media Breaking News  WhatsApp Channel

Mahanaadu Media Breaking News

5.8K subscribers

About Mahanaadu Media Breaking News

*ప్రశ్నించడం మా ఇజం.. ధైర్యం మా నైజం.* *ఇజాల నిజాల మేలు కలయిక.* *బడుగు వర్గాల గొంతుక.. గొంతులేనివారికి వేదిక...మీ మహానాడు మీడియా!* *#mahanaadumedia*

Similar Channels

Swipe to see more

Posts

Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 9:06:15 AM

*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ప్రముఖ సంగీత దర్శకులు శివమణి.* *( Mahanaadu Media )* *అమరావతి క్యాంప్ కార్యాలయంలో కలిసి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందించిన శివమణి.* *#MahanaaduMedia*

Post image
❤️ 👍 3
Image
Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 8:52:52 AM

*విశాఖ: యోగాంధ్ర వేడుకలపై మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష.* *( Mahanaadu Media )* *సమీక్షలో పాల్గొన్న మంత్రులు అనిత, అచ్చెన్న, డీబీవీ స్వామి, మంత్రులు బీసీ జనార్దన్‍రెడ్డి, అనగాని సత్యప్రసాద్.* *యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.* *యోగా కార్యక్రమానికి 5 లక్షల మందిని లక్ష్యంగా పెట్టుకున్నాం.* *ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తున్నాం.. రెండు వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.* *ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు.* *విశాఖ వాసులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం : హోంమంత్రి అనిత* *#MahanaaduMedia*

Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 9:23:51 AM

*ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లే ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య.* *( Mahanaadu Media )* *బోయింగ్ 787 AI 143 విమానంలో సాంకేతిక సమస్య.* *విమానంలో హైడ్రాలిక్ లీక్ అయినట్లు అనుమానం.* *#MahanaaduMedia*

😢 1
Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 9:09:02 AM

*కుప్పంలో మహిళపై దాడి ఘటనపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ.* *( Mahanaadu Media )* *నారాయణపురంలో భర్త అప్పు తీర్చలేదని భార్యపై దాడి బాధాకరం.* *బాధితురాలితో వీడియో కాల్‍లో పరామర్శించిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్.* *ఆధునిక సమాజంలో ఇలాంటి పాశవిక ఘటనలు సిగ్గుచేటు.* *ఫోనులో జిల్లా ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాయపాటి శైలజ.* *బాధితులకు అండగా ఉండాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు.* *#MahanaaduMedia*

Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 8:46:00 AM

*🚨 Big Blasting News - Mahanaadu Media 🚨* *తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు.* *హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్.* *BRS ప్రత్యర్థి పార్టీలతో పాటు ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు.* *తెలంగాణ, ఏపీలో 1000 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు.* *తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్.* *2018 నుంచి 2023 వరకు ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు.* *#MahanaaduMedia*

😮 1
Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 9:10:51 AM

*రేపు తెలంగాణ సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల భేటీ.* *( Mahanaadu Media )* *బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సమావేశం.* *పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్.* *ఆల్ పార్టీ ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోనున్న ఉత్తమ్.* *సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‍కి ఆహ్వానం.* *#MahanaaduMedia*

Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 10:27:39 AM

*విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సోమిరెడ్డి.* *( Mahanaadu Media )* *కాకాణిపై 2019లో పరువు నష్టం కేసు వేసిన సోమిరెడ్డి.* *కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశం.* *తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా వేసిన కోర్టు.* *#MahanaaduMedia*

Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 10:26:11 AM

*ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎంకు మంత్రి సత్యకుమార్‌ 5 పేజీల నివేదిక.* *( Mahanaadu Media )* *కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో ఆరోగ్య శాఖ పనితీరుపై సత్యకుమార్‌ నివేదిక.* *ప్రజా వైద్య రంగంలో జవాబుదారీతనం, క్రమశిక్షణ తీసుకొచ్చాం.* *అక్రమాలు, అవినీతి, రాజకీయ జాప్యానికి అడ్డుకట్టలు వేశాం: మంత్రి సత్యకుమార్‌* *#MahanaaduMedia*

Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 8:49:22 AM

*సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష.* *( Mahanaadu Media )* *వ్యర్ధాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చ.* *రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ యోచన.* *ప్రతిపాదనలు సిద్ధం చేసిన ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’.* *సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై దృష్టి పెట్టిన రాష్ట్రం.* *మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కేంద్రం కార్యాచరణ.* *వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.* *నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి.* *#MahanaaduMedia*

Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
6/17/2025, 8:34:10 AM

*మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.* *( Mahanaadu Media )* *అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం.* *టేకాఫ్ ముందు విమానంలో లోపాన్ని గుర్తించిన పైలట్.* *విమాన సర్వీసును రద్దు చేసిన ఎయిరిండియా.* *#MahanaaduMedia*

Link copied to clipboard!